అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశినీ పురస్కరించుకుని తెల్లవారుజామున కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,భార్య మాధవి దంపతుల కుమారుడు కృష్ణ వంశీ దర్ రెడ్డి,స్వామి వారికి ప్రత్యేక పూజలునిర్వహించారు.కల్వకుర్తి నియోజకవర్గ,ప్రజలందరూ,ఆయురారోగ్యాలతో వర్దిల్లాలనీ రైతుల ఇంట్లో పంటలు సమృద్ధిగా పండి ఆనందాలు విరాజిల్లాలని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు.అనంతరం దేవస్థానం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.
