అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి:కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుండె మరియు కంటి వ్యాధుల నిర్దారణ పరీక్షలు శనివారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బాలసాని లెనిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని కొత్తపల్లి పాఠశాల ఛైర్మెన్ సబ్బు రాజకుమారి సతీష్ సోసైటీ డైరెక్టర్ మెట్టు సమ్మయ్య ప్రారంభించారు
కాగా ఈ శిబిర్యానికి భారీ స్పందన లభించింది.321 మందికి పరీక్షలు నిర్వహించారు.ఈ శిబిరానికి లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు నేత్రవైద్య నిపుణులు పూదరి దత్తాగౌడ్ సహకారంతో,ఫార్చ్యూన్ మెడ్ కేర్ ఆసుపత్రి,శరత్ మ్యాక్సీ విజన్ కరీంనగర్ వారి సౌజన్యంతో నిర్వహించారు.మధుమేహం(Sugar),బీపి, ఇసీజీ,2డిఎకో మరియు కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెడ్ కేర్ క్యాంపు ఇంచార్జ్ గజవెల్లి గణేష్ గ్రామ యువకులు డబ్బేట అనిల్ మెట్టు రాజేందర్ ఎంచర్ల తిరుమలేష్ బైరి సతీష్ పెర్క టీంకు,వినోద్ యాదవ్, బొబ్బిలి రాకేష్,కలవేన మహేష్ శిలారపు రమేష్ ,పిల్లి అనిల్, చల్లూరి వంశీ,బన్నీ బొంత వంశీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

