ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్ఠికరణ..

అగ్నిధారన్యూస్ ఎన్ టి పి సి:ఎన్టిపిసి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, భూనిర్వాసితులకు సరైన న్యాయం విషయంలో ఎన్టిపిసి యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సరైన ప్రకటన చేయకుండా తెలంగాణ ఎన్టిపిసి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరిపే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈనెల 28న జరిగే పబ్లిక్ హియరింగ్ ను ముట్టడిస్తామని, అదే రోజు ఎన్టిపిసి బందుకు పిలిపిస్తున్నామని తెలిపారు. ఎన్టిపిసి నిర్మాణం కోసం పదివేల ఎకరాలను ఈ ప్రాంతానికి చెందిన 35 మంది రైతులు ధారా దత్తం చేశారని, భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉపాధి, పునరావాసం కల్పిస్తామని ఆనాడు ఎన్టిపిసి హామీ ఇచ్చిందన్నారు. అయితే ఎన్టిపిసి ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దేశానికి వెలుగులు పంచుతుందని రైతులు తమ పంట పొలాలను త్యాగం చేస్తే వారి జీవితాలను ఎన్టిపిసి చీకటిమయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట 2600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించిన ఎన్టిపిసి తర్వాత తెలంగాణ ప్రాజెక్టు మరో 1600 మెగావట్ల ప్రాజెక్టును నిర్మించింది అన్నారు. ఈ తెలంగాణ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల 3 యూనిట్లను నిర్మించడానికి సిద్ధమైందన్నారు. రెండో దశ కింద నిర్మించే 2400 మెగా అట్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 28న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోందని తెలిపారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ కంటే ముందే భూ నిర్వాసితులకు ఏం న్యాయం చేస్తారని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రాంత ప్రజల సంక్షేమానికి ఏం చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రాజెక్టులలో ఎనిమిది వందల మందికి మించి పర్మినెంట్ ఉద్యోగులు లేరని, నాలుగైదు వేల మంది కాంట్రాక్టు కార్మికులే పని చేస్తున్నారని తెలిపారు. ఎన్ టి పి సి యాజమాన్యం తెలంగాణ ఎంపీపీ ప్రాజెక్టులో ఈ ప్రాంతంలోని భూ నివాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల పిల్లలు స్థానికుల కోసం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని అందుకు అనుగుణంగా విద్యాసంస్థలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సి ఎస్ ఆర్ నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నిటిపై ఎన్టిపిసి యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతనే  ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. కాగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న టిఆర్ఎస్ నాయకులపై పోలీసులను ఉసిగల్పుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చందర్ ఆరోపించారు.  విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..