Oplus_131072

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి కావలసిన నీటిని అక్రమంగా గత కొద్ది రోజులుగాఎస్సారెస్పీ కెనాల్ కు ట్రాక్టర్ సహాయంతో మోటారును బిగించి ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు ట్యాంకర్ల నీటిని తరలిస్తున్నారు. రాబోయే వేసవికాలం దృష్ట్యా కింది ఉన్న వ్యవసాయ భూములకు నీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు తగు చర్యలను తీసుకొని ట్యాంకర్లపై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ అధికారులను వివరణ కోరగా ఈ విషయం తమకు తెలియదని పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు.