Oplus_131072

అగ్నిధార న్యూస్ మంథని :

మంథని రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులతో కలకలం రేగింది. భూమి సర్వే రిపోర్ట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ల్యాండ్ సర్వేయర్ రెడ్ హ్యాండెడ్ గా గురువారం రాత్రి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి కథనం ప్రకారం మంథని మండలం రెవెన్యూ సర్వేర్ గా పని చేస్తున్న జాటోతు గణేష్ మంథని రెవెన్యూ గ్రామ శివారులోని రెడ్డి చెరువు వద్ద సర్వేనెంబర్ 814 /డి /1, 815/సి సర్వే నెంబర్ల ఒక ఎకరం భూమిని కొలిచేందుకు రైతు సువర్ణ క్రాంతి దగ్గర రూ.17వేల డిమాండ్ చేశారు. ఈనెల 5న తొమ్మిది వేల రూపాయలు తీసుకున్నాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ ని ఆశ్రయించాడు. మరో మూడు వేలు రెండవ వాయిదాగా గురువారం ఇస్తానని ఫోన్ చేయగా సర్వేయర్ ఆఫీసుకు కాకుండా బస్టాండ్ కు రమ్మని బాధితునికి చెప్పాడు దీంతో బాధితుడు రూ. 3000 బస్టాండ్ లో సర్వేయర్ గణేష్ కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంథని పట్టణంలో చాలా రోజుల తర్వాత ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ఉద్యోగుల్లో ఒకసారిగా కలకలం రేగింది. దాడుల్లో ఏసీబీ సిఐలు తిరుపతి,కృష్ణ కుమార్, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శ్రీకాంత్, హోంగార్డులు అశోక్, సంతోష్ లు ఉన్నారు.