చేతిరాతలో రాణిస్తున్న నోబెల్ విద్యార్థులు.

చేతిరాత నేర్చుకో తలరాత మార్చుకో …

చేతిరాతతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. 

పోటీ పరీక్షల్లో రాణిస్తారు. 

పాఠశాల కరస్పాండెంట్ మోహనరాజా.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి 

విద్యార్థులను ఆటలు పాటలతో పాటు చదువుల్లో ముందంజ ఉంచడంలో పెద్ద కలవల గ్రామంలో నెలకొల్పబడిన నోబెల్ స్కూల్ యాజమాన్యం అహర్నిశలు కృషి చేస్తున్నారు. విద్యార్థులు చదివిన చదువులో రాణించి మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థుల యొక్క చేతిరాత బాగుండాలని అలా ఉన్నట్లయితే విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నెలకొల్పబడి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి దోహదపడుతుందని గ్రహించిన పాఠశాల కరస్పాండెంట్ మోహనరాజ పిల్లల చేతిరాత గుండ్రంగా ఉండడానికి చేతిరాత నేర్పించడంలో నిశ్నితులైన ఉపాధ్యాయులచే మేలుకోలు నేర్పించి. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేతిరాత లో పోటీ పరీక్షలలో రాణించేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్షర ఫౌండేషన్ హైదరాబాద్ వారు డిసెంబర్ నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి  చేతివ్రాత పోటీలో నోబెల్ స్కూల్ విద్యార్దులు ఆదివారం స్టేట్ లెవెల్ పురస్కారం అందుకున్నారు .. రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందుకున్న విద్యార్థుల  వివరాలు… నోబెల్ హై స్కూల్ పెద్దకల్వల విద్యార్దులకు Top 10 లో 3  Ch అన్విత,7th K. శ్రీనిధి7th,, హస్మిత విద్యార్దులకు  సాయి రిత్విక 7th, శన్విశ్రీ,3rd , వరుణ్య శ్రీ5th ,s. అస్మిత 2nd, వినిష 1st, లకు రాష్ట్ర స్థాయి బహుమతులు లభించాయి …భారతి విద్య పరిషత్ హైదరాబాద్  లో జరిగిన కార్యక్రమం లో ప్రముఖ సైకాలజిస్ట్,గ్రాఫోలోగిస్ట్ శివరం ప్రసాద్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు .. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు ప్రణీత, పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీలత, పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.