క్షత గాత్రులను 108లో తరలింపు,
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.
అతివేగంతో ట్రావెల్ బస్సును డికొన్న రెండు కార్లు.
ట్రాఫిక్ జాంతో భారీగా నిలిచిన వాహనాలు.
అగ్నిధార న్యూస్ వనపర్తి జిల్లా :
పెబ్బేరు సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ కు చెందిన వారు ట్రావెల్ బస్సులో తిరుపతిలో జరుగు పెళ్లివేడుకకుబయలుదేరారు కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లుతున్న హెరిటీగా, టాటా హెక్జా కార్లు అతివేగంతో వస్తూ సైడ్ డివైడర్ డికొని ఎదురుగా వస్తున్న పెళ్లి ట్రావెల్ బస్సును డీ కొన్నాయి. ఈ ఘటనలో ట్రావెల్ బస్సులో ప్రయాణం చేస్తున్న 45మంది ప్రయాణికులకు స్వల్ప గాయాల పాలైన్నారు.రెండు కారులో ప్రయాణం చేస్తున్న వారిలో ముష్టి విష్ణు (30)మృతి చెందగా మిగతా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గాయాలపాలైన క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై దాదాపుగా అర్ధ గంటకు పైగా కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జాంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

