*మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పటిష్ట కార్యాచరణ*

**అదనపు తరగతి గదిలో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి*

**ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి*

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ పట్టణంలో 1036 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం ఆమోదించడం జరిగిందని, వీరిని ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోగా ఫీజు చెల్లించేలా చూడాలని కలెక్టర్ కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మార్చి 31 లోపు  పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినట్లయితే 25% రీబెట్ లభిస్తుందని అన్నారు. పట్టణంలోని వార్డు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో జరుగుతున్న అదనపు తరగతుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను కలెక్టర్ పరిశీలించారు.  ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు నిర్వహించాలని, ఎమర్జెన్సీ కేసులు ఉంటే కరీంనగర్ లేదా పెద్దపల్లి ఆసుపత్రులకు తరలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జనరల్ ఓపి సంఖ్య పెరిగేలా చూడాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పరిశీలించి  నిర్వహకులతో క్యాంటీన్ నిర్వహిస్తున్న తీరు, క్యాంటీన్ సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట  సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్,  మండల విద్యాశాఖ అధికారి రాజయ్య, హెడ్మాస్టర్ శారద, ఆర్.ఎం.ఓ డాక్టర్ మహేందర్, వైద్యాధికారులు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.