అగ్నిధార న్యూస్ కాల్వ శ్రీరాంపూర్ 

విద్యుత్ షాకుతో మృతి చెందిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం పెగడపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నక్కల రవి తన పొలానికి నీళ్లు పెట్టేందుకు  విద్యుత్ మోటారు స్టార్ట్ చేయగా షాక్ రావడంతో నక్కల రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తమై సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఇదిలా ఉంటే ఆయన మృతితో ఆసుపత్రి ప్రాంగణం రోదనలతో నిండిపోయింది.