కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి.
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,రాజీవ్ యువ వికాసం పేరుతో 6000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి తల కొండ పల్లి మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. తెలిపారు.గత పది సంవత్సరాలుగా తీవ్ర అన్యాయానికి గురి అయిన నిరుద్యోగులకు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తూనే మరొకవైపు ఉపాధి అవకాశాల్ని పెంపొందించడం కోసం సబ్సిడీతో లోన్ అందించడం హర్షించదగ్గ విషయమని మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సహకరించిన క్యాబినెట్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇన్చార్జిలకు బీసీ కమిషన్ చైర్మన్ మరియు ఎస్సీ కమిషన్ చైర్మన్ లకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తల కొండపల్లి మండల పరిధిలో ఉన్న యువత ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని ఈ రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగులకు ఒక గొప్ప వరం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
