అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం, కార్యకర్తలు నాయకులతో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో ఒకసారిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇరు వర్గాల నాయకుల,కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది… ఒక దశలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. బూతు పురాణం మొదలుపెట్టారు. ఫోటో షూట్ కాస్త రచ్చ రచ్చగా, మారింది. కార్యాలయ ప్రాంగణమంతా ఘర్షణ వాతావరణానికి దారితీసింది. అది గమనించిన స్థానిక నాయకులు సర్ది చెప్పినప్పటికీ శాంతించలేదు. స్వయంగా ఎమ్మెల్సీ కవిత ముందే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న పెద్ద నాయకులంతా ఒక్కసారి కంగుతున్నారు. పెద్దపల్లి జిల్లాాలో బిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. చాలా రోజులుగా ఇరు వర్గాల నాయకుల, కార్యకర్తల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
