అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే కాట్నపల్లి గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తి కరీంనగర్ కు ఆటోలోవెళ్లి తిరిగి ప్రయాణంకాగ కాట్నపల్లి గ్రామం దగ్గరలో ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో అజయ్ కు తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానిక సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

