జిల్లాస్థాయిలో జావలిన్ త్రో 18.60 మీటర్లు త్రో.

విద్యార్థిని రిషికశ్రీనీ అభినందించిన  కరస్పాండెంట్ మోహనరాజా. 

రాష్ట్రస్థాయి పోటీలకు రిషికశ్రీ.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

శనివారం జిల్లాస్థాయి  జావలిన్ త్రో పోటీలను సుల్తానాబాద్ మండలంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి  విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి మండలo పెద్దకల్వల గ్రామంలో నోబెల్ హైస్కూల్  లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిషికశ్రీ  జిల్లాస్థాయిలో జావలిన్ త్రో 18.60 మీటర్లు త్రో చేసి ప్రథమ స్థానంలో  నిలిచి బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా  పాఠశాల కరస్పాండెంట్  కరస్పాండెంట్ మోహనరాజా. విద్యార్థినిని అభినందిస్తూ, మాట్లాడారు… ఈనెల7వ తేదీన జనగాoలో  జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో,నోబెల్ పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు  ప్రణీత, విద్యార్థిని అభినందించారు. పాఠశాల ఇన్చార్జి రవీందర్ , పి ఈ టి సురేష్ పాల్గొన్నారు.