బీజేపీలోకి నల్ల మనోహర్ రెడ్డి.

5న పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర అధ్యక్షుని సభలో చేరిక.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా  ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న, ఆయన చేరిక ఖరారైంది, మొదట జూలై 31 వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినప్పటికీ. అనివార్య కారణాలవల్ల చెరిక వాయిదా పడింది.  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ముఖ్య అనుచరుడు, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, నల్ల మనోహర్ రెడ్డి ఈ నెల 5న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న బిజెపి జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు హాజరుకానున్నారు.. అదే సమావేశంలో  పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో నల్ల మనోహర్ రెడ్డి నియోజకవర్గంలోని తన  అనుచరగనంతో బిజెపి కండువా కప్పుకోనున్నారు. జూలపల్లి మండలానికి చెందిన నల్ల మనోహర్ రెడ్డి ఎన్ఆర్ఐగా  ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు, మొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, అనంతరం మారిన పరిణామాలతో టిఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర స్థాయిలో కీలక వ్యక్తిగా, కేటీఆర్ కు ముఖ్య అనుచరునిగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. 2023 లో జరిగిన ఎన్నికలలో టికెట్ ఆశించి బంగపడ్డారు. టిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చినట్లయితే ఎమ్మెల్సీ గా చేస్తానని కేటీఆర్ మాట ఇవ్వడంతో ఇప్పటివరకు  బిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. గత  20 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉంటూ.. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నల్ల ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. గ్రామాల్లో, యువకుల్లో, ప్రజల్లో మంచి ఆదరణ ఉండడంతో బిజెపి లోని ఒక ముఖ్య నాయకుడి ప్రోత్బలంతో పార్టీలో చేరుతున్నారనేది చర్చ. తన చేరికతో పెద్దపల్లి నియోజకవర్గంలో బిజెపికి మంచి ఊపు వచ్చే అవకాశాలు ఉన్నాయని బిజెపి కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.. నల్ల చేరికతో బిజెపికి నూతన ఉత్తేజంతోపాటు,  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా  బీజేపీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.