శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు.
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ క్రైమ్ ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కురుకు చెందిన బుర్ర రేణుక భర్త రాములు, అల్లిపూర్ కు చెందిన బండ రాణి భర్త భూమయ్య, రేగడి మద్దికుంట కు చెందిన ముంజాల అశోక్, అల్లిపూర్ కు చెందిన ఏరుకొండ వినోద్, మరో వర్గం అల్లిపూర్ కు చెందిన ముంజాల సతీష్, ముంజల శ్యామల భర్త సతీష్ గ్రామంలో భూ వివాదంలో ఇరువర్గాలు ప్రజలు సంచరిస్తున్న స్థలంలో గొడవ పడుతూ బూతులు తిట్టు కుంటుండ గా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోర్టు సిబ్బంది ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ దుర్గా దాస్, కానిస్టేబుళ్లు మునీందర్, సదానందం లతో కలిసి గొడవ జరుగుతున్న స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదయించినప్పటికి వినకుండా తిరిగి బూతులు తిట్టుకుంటూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ దుర్గా దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు కాగా, ఇట్టి కేసు విచారణలో భాగంగా నోటీసులు అందించేందుకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి నోటీసులు అందించిన అనంతరం ఇరు వర్గాలను సీఐ సుబ్బారెడ్డి ఏ ఎస్ ఐ పి వి కరుణాకర్ కానిస్టేబుల్ తో కలిసి కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఎరుకొండ వినోద్ ఆవేశానికి లోనై పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ లపై దురుసుగా మాట్లాడుతూ బూతు మాటలు తిడుతుండగా ఏఎస్ఐ కరుణాకర్ వినోద్ ను వరించే ప్రయత్నం చేయగా, ఎరుకొండ వినోద్ ఏఎస్ఐ పి వి కరుణాకర్ ను బూతులు తిడుతూ నెట్టివేసి విధులకు ఆటంకం కలిగించడంతో కరుణాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రావణ్ కుమార్ కేసు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.