అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్:

100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి…. అదనపు కలెక్టర్ దీపక్ కుమార్… సుల్తానాబాద్ అక్టోబర్ 30 సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ (దుబ్బలపల్లె) జరుగుతున్న డోర్ టు డోర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ కుమార్ , ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు, ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేసుకుని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయించాలన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అంజయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు,ఏఎన్ఎంలు, మహిళా గ్రూప్ సి ఎ లు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.