అగ్ని ద్వారా న్యూస్, సుల్తానాబాద్:
*రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్* *పోటీలకు ఎంపికైన రేగడి మద్ది కుంట విద్యార్థిని….* సుల్తానాబాద్ తేదీ 23.10.2021 శనివారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్ మైదానంలో జరిగిన పెద్దపెల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జెడ్ పి హెచ్ ఎస్ రేగడి మద్ది కుంట 10వ తరగతి విద్యార్థిని బల్ల .అపూర్వ అండర్ 14 ఈ విభాగంలో 400 మీటర్లు పరుగు పందెంలో పాల్గొని ప్రథమ బహుమతి పొంది , ఆదివారం (31.10.2021 )ఖమ్మం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది.ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అపూర్వ అభినందనలు తెలియజేయునైనది ,ఈ సమావేశంలో విద్యా కమిటీ చైర్మన్ సదయ్య, జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయురాలు జి .ప్రమీలాదేవి, ఉపాధ్యాయులు వి .చంద్రమౌళి, బి .సురేంద్రమోహన్ , శ్రీగిరి .తిరుపతి, సదానందం ,సౌజన్య, పద్మజ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని అపూర్వ కు ప్రత్యేక ప్రశంసలు తెలిపారు.
