అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్:

సుల్తానాబాద్ మండలం, దుబ్బపల్లి గ్రామములో ఎవరో గుర్తు తెలువని సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మతిస్థిమితం సరిగా లేక ఎక్కడ నుండో వచ్చి దుబ్బపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుండి తిరుగుతున్నా ఒక మహిళ చనిపోయి ఉన్నది. ఆమె చామన చాయ రంగు కలిగి గుండ్రని మొఖం కలిగి ఉన్నది. పొట్టపై పుట్టు మచ్చ వుంది. గులాబీ రంగు జాకెట్  , ఎరుపు, పసుపు రంగుల డిజైన్స్ గల చీర ధరించి వుంది. ఎవరైనా రక్త బంధువులు ఆమె మృతదేహం ను చూచి గుర్తుపట్టుటకు రాగలరు. ఈ క్రింది ఫోన్ నంబర్లకు కాల్ చేయగలరు. లేదా  డైరెక్ట్ గా సంప్రదించండి.

U. ఉపేందర్రావు
సబ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్
సుల్తానాబాద్, పోలీస్ స్టేషన్
9440795152.
8331940671.