అగ్నిధారన్యూస్ పెద్దపల్లి కలెక్టరేట్

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి సతీష్ అనే వ్యక్తి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

బండి సతీష్ తండ్రి మధునయ్య కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ప్రాథమిక పాఠశాలలో గత 45 సంవత్సరాలుగా పార్ట్ టైం స్వీపర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున తన తండ్రి విధి నిర్వహణలో విషపురుగు కాటు వేయడంతో అస్వస్థతకు గురై కరీంనగర్  ఆస్పత్రులో చేర్పించామని,  ఆరోగ్యం విషమించడంతో, 29 తేదీన వరంగల్ ఎంజీఎం కి తరలించగా, చికిత్స పొందుతూ, అక్కడే మృతి చెందాడని. విధి నిర్వహణలో చనిపోవడంతో, తమ కుటుంబానికి న్యాయం చేయాలని పాఠశాల ఆవరణలో మృతదేహంతో, మృతుని బంధువులు ఆందోళన చేపట్టడంతో అధికారులు ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇప్పిచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చకపోను, ఆఫీసులో చుట్టూ తెప్పించుకుంటున్నారని, ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నాడు.   అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ న్యాయం జరగడం లేదని, ఆందోళన చెంది సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న, ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అధికారులు 108 కి ఫోన్ చేసి సతీష్ ని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు.