అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆద్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ పెద్దపల్లి జిల్లాలో విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. శనివారం పెద్దపల్లిలో జరిగిన బంద్ లో ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, పెద్దపల్లి మండల అధ్యక్షులు సింగారపు రవికుమార్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కొమురయ్య యాదవ్, గుర్రాల వీరేశం, జిల్లా జనరల్ సెక్రెటరీ కందుల అశోక్ పటేల్, జిల్లా సలహాదారుడు మంద భాస్కర్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షుడు నల్లవెల్లి అశోక్, మాజీ ఎంపీటీసీ రాపోలు హనుమంతరావు, కాపులపల్లి, గోపయ్యపల్లి గ్రామ అధ్యక్షులు పెండెం అంజి, నేరెళ్ల లక్ష్మణ్, తాడవేన రవి, బుర్రగడ్డ అనిల్, తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో బందు పర్యవేక్షించారు. బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి నినాదాలు చేశారు.
