అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

అన్నదాతకు తోడుగా సిఎం కేసీఆర్ . కేంద్రం యాసంగి వడ్లు కొనేదాక కొట్లాడుతాం..గోదారి నీళ్లతో రైతాంగం కాళ్లు కడిగింది టిఆర్ఎస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగోచ్చేదాక పోరాటం ఆగదు…రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలు.దుక్కిదున్నె రైతన్నల కోసం మహధర్నా.

 రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతుంది… వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేయడంతో
పాటు తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన వరిధాన్యాన్ని కోనుగోలు చేయకుండా రైతాంగాన్ని కష్టపెడుతుందని, అన్నదాతలకు
తోడుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర ఐటి శాఖమాత్యులు కేటిఆర్  ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్త గాంధీచౌక్ లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  నియోజవర్గంలోని రైతులతో పెద్ద ఎత్తున రైతు మహధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోదారి నీళ్లతో రైతాంగం కాళ్లు కడిగింది టిఆర్ఎస్ అని, తూరుపున పారుతున్న గోదావరినదిని
పడమరకు దిశ మార్చి ఎంతో గొప్పగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదవరినదిని తెలంగాణ పోలాల్లో పారించి తెలంగాణ దశ
మార్చిన ఆపర భగీరథులు సిఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు హిత సంక్షేమ పథకాలను అమలు చేస్తు
తెలంగాణ.  రాష్ట్రాన్ని సస్యశామలంగా మార్చింది కేసీఆర్ అన్నారు.

కారోనా సమయంలో తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడవద్దనిప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కోనుగోలు చేస్తామన్నారు అన్నారు. తెలంగాణ రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఆని, భాజపా ప్రభుత్వం
రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేస్తు రాష్ట్రంలో పండిన వరిధాన్యాన్ని కోనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుందని యాసంగి వడ్లు కోనేదాక కోట్లాదుతామని, కేంద్రం ప్రభుత్వం దిగోచ్చేదాక పోరాటం ఆగదన్నారు.

తెలంగాణ రైతులకుఅండగా నిలుస్తామని రైతాన్నల
కోసమే మహధర్నా చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రైతులను అండగా నిలుస్తున్న రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతులగా నిలువాలన్నారు  .ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్,టిబిజికెఎస్అధ్యక్షులు వెంకట్రావు మండల ఎంపీపీలు,జడ్పీటిసిలు, అభిషేక్ రావు, వైస్ ఎంపిపిలు, సర్పంచులు, టీఆరెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..