అగ్నిధార న్యూస్ ,మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ ఏరియాఎస్ఆర్పీ-3 బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొప్పులమంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు కృష్ణా రెడ్డి మరియు శ్రీ బెర లక్ష్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించినారు ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ఈ సంఘటన అత్యంత బాధాకరం దురదృష్టకరం . వారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అన్నారు . మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామని మనోధైర్యాన్ని కలిగించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ నడిపల్లి దివాకర్ రావు , రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్యక్షులు శ్రీ వెంకట్రావు , శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీ M సురేష్ గ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి , కెంగర్ల మల్లయ్య శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి శ్రీ మంద మల్లారెడ్డి SO to GM శ్రీ KHN గుప్తా గారు విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
