అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి విడనాడాలి
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ డిమాండ్.…. దేశానికి అన్నం పెట్టే రైతులు దేశంలో రాష్ట్రంలో నేడు పండించిన పంటను అమ్ముకోవడానికి అవకాశం కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజు కు విఫలం చెందుతున్నాయి అన్నారు. రైతులను రెండు ప్రభుత్వాలు అరిగోస పెడుతున్నాయి అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు అనే నానుడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిజమని నిరూపించుకుంటున్నాయి అన్నారు. రెండు ప్రభుత్వాల వ్యవహారం రైతులకి ఈతాకు ఇచ్చి తాటాకు దోబ్బు దాము అనే విధంగా తయారైంది అన్నారు. నేడు రైతుల బతుకు ఏ విధంగా తయారయింది అంటే రైతులు పంటలు పండించడానికి అప్పోసప్పో తెచ్చి పెట్టుబడి పెడదామంటే ధరలు అగ్గి ఆరు తున్నాయి అన్నారు. రైతులు పెట్టే పెట్టుబడికి వచ్చేటటువంటి డబ్బులకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. లాభాలు రాక పోను నష్టాల ఊబిలోకి కూరుకు పోతున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా సిగ్గుగా ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలు తెలుగు రాష్ట్రాలలో సవరణ చేసిన విషయం టిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదు అన్నారు.చిన్న సన్నకారు రైతులు తాము పండించిన పంట ఎక్కువ ధరకు వేరే రాష్ట్రాల్లో వేరే చోటకు వెళ్లి అమ్ముకోడానికి అవకాశం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి ఆ విధంగా ఉన్నదా అన్నారు. ఇది కేసీఆర్ కు కేసీఆర్ ప్రభుత్వం తెలియదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అన్నారు . రాష్ట్రంలో రెండు పంటలు వరి ధాన్యం పండించడం కోసం నీటి ఇబ్బందులు ఉండకూడదని కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఈ వేసంగి పంట ఆరుతడి పంటలు వెయ్యండి అని సూచించడం సిగ్గుచేటు అన్నారు. ఒకసారి దొడ్డు వడ్లు అని మరొకసారి సన్న వడ్లు అని మరోసారి ఆరుతడి పంటలు వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతూ అయోమయానికి గురి చేస్తోందన్నారు. గతంలో వరి ధాన్యం ఎంత పండించిన కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్వయంగా కేసీఆర్ చెప్పారు అన్నారు. తర్వాత వరి ధాన్యం కొనేది లేదని చెప్పడం రైతుల మనోభావాలు దెబ్బ తీసినట్లే అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు .ఈ సీజన్ లో ఇంతవరకు పెద్దపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నేటికీ ప్రారంభించలేదు అన్నారు . వేసంగి లో పండించే పంట గురించి ఇంతవరకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతన్నలకు వందేళ్ల చరిత్రలో ఏ రోజు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రైతులకు రాలేదన్నారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న టువంటి దొంగ నాటకాలు ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెపుతారు అన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొంపల్లి రాజయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు మల్యాల తిరుపతి తదితరులుపాల్గొన్నారు.
