అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్వయంభువుగా వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం. జైనుల కాలం నాటిదని పూర్వికులు చెబుతూ వస్తున్నటువంటి మాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మన రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు జాతర సమయంలో తండోపతండాలుగా వస్తారు . స్వామి వారిని దర్శించుకున్న వాళ్లకి సకల సంపదలు కలుగును భూతప్రేత పిశాచ బాధలు నివృత్తి అవుతాయని స్వామివారి కృపా కటాక్షాలకు పొందుతారని ఆలయ E O శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ తేదీ 16. 11 .2021 నుండి తేదీ 25 .11 .2021 వరకు వివిధ రూపాలలో ఘనంగా జాతర కార్యక్ర మాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు 21.11.2021 రోజున బిందె తీర్థం నిత్యార్చన హోమము బలి హరణము తీర్థప్రసాద గోష్టి సాయంత్రం హోమము బలిహరణము గాలిగోపురం లోకి పల్లకి సేవ ఊరేగింపు తీర్థప్రసాద గోష్టి కన్నుల పండుగగా జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా గోదావరిఖని వాస్తవ్యులు అయినటువంటి పంజాల కనకయ్య పుష్పలీల వారి కుమారులు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అంతా సుందరీకరణకు గాను గ్రానైట్ రాళ్లు, ఆలయంలోని గాలి గోపురం ఆధునీకరణ కోసం ముందుకు వచ్చారు . ఈ సందర్భంగా ఆలయ శంకర్ కనకయ్య పుష్పలీల దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు లు సిబ్బంది పాల్గొన్నారు.
