ధాన్యం తరుగు పేరుతో కోతలు.

అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
కాంటాలకు తాళం వేసిన వైనం.

ఉన్నతాధికారులు దృష్టి సారించాలి ఏం జరుగుతుందో తేలాలి.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా క్రైమ్:
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం కన్నాల పిఎసిఎస్ పరిధిలోని పాలకుర్తి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహణ రోజుకో వివాదాస్పదమైన మలుపులు తిరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఆ గ్రామ సర్పంచ్ గతంలో సెంటర్ ఇన్చార్జిగా పనిచేసిన జ్యోతి లా మధ్య వివాదం రాజుకొని వర్గాలుగా విడిపోయి ఒకరి పైన ఒకరు ప్రెస్ మీట్ పెట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే, కొనుగోలు సెంటర్ వివాదం చిలికి చిలికి గాలి వాన కావడంతో, ధాన్యం కొనుగోలు నిర్వహణ బాధ్యత పిఎసిఎస్ సీఈవో ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటే….
రైతులు పండించిన ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో పోస్తే అధికారులు పట్టించుకోవడంలేదని అమ్యమ్యాలు ముట్ట చెప్పిన రైతుల దాన్యం కొనుగోలు ముందుగా చేపడుతూ ముందుగా తీసుకువచ్చిన రైతుల ధాన్యాన్ని విస్మరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం ధాన్యం జోకే కాంటాలకు తాళం వేశారు. అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలకుర్తి కి చెందిన మాదాసు భూమయ్య అనే రైతు తన దాన్యం మొత్తం ఒక లారీలో 698 బస్తాలు ఒక్కొక్క బస్తా 41 కిలోల 200 గ్రాముల వరి ధాన్యం ఉదయం హమాలీలు తూకం వేశారు. సాయంత్రం
పెద్దపల్లిలోని పద్మావతి మిల్లుకు అదే వరి ధాన్యం లోడును సీఈవో పంపించారు. ఉదయం ధాన్యం జోకినప్పుడు రైతుకు ఇచ్చిన ట్రక్ షీట్ ప్రకారం 279.6 క్వింటాళ్ల ధాన్యం, రికార్డ్ చేయబడింది. అదే 698 బస్తాల వరి ధాన్యం లారీని పద్మావతి మిల్లు వద్ద వే బ్రిడ్జి వేసినప్పుడు 273.5 క్వింటాళ్లుగా నమోదు కాబడింది. అంటే ఇక్కడ ఉదయం కేంద్రంలో జోగినప్పుడు మొత్తం ధాన్యం 27920 కిలోల ధాన్యం సాయంత్రానికి 27350 కిలోల ధాన్యంగా మారిపోయింది. దాదాపు ఆరు క్వింటాళ్ల ధాన్యం తగ్గిపోయింది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే.. రైతు మాదాసు భూమయ్య ఇదే విషయమై కన్నాల సీఈవో సదానందంను అడిగితే 30 బస్తాల ధాన్యం షాట్ వచ్చిందని ఆలోచించుకోమని అన్నాడని రైతు తన ఆవేదనను అగ్నిధారతో చెప్పుకున్నాడు. ఇలాంటి బాధిత రైతులు గ్రామంలో ఇంకా ఉన్నట్లు తెలిసింది.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లకు ,అధికారులకు, వీడియో కాన్ఫిరెన్స్ లు పెట్టి రైతులను అధికారులు గాని దళారులు గాని ఇబ్బందులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇలాంటి అక్రమాలు జరగడం దేనికి సంకేతం
ఇదే విషయమై వివరణ కోసం కన్నాల సీఈవో సదానందంకు పలుమార్లు ఫోన్ చేసిన స్పందించలేదు.
ఏది ఏమైనా గందరగోళంగా ఉన్న పాలకుర్తి పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంపై స్వయంగా జిల్లా కలెక్టర్ లేదా, జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి చక్కదిద్దాలి. తూకం పేరుతో నష్టపోయిన భూమయ్య ఇతర రైతులను విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తేలాల్సిన అవసరం.