29.9.2021 రోజున జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. 15.11.2021 రోజున పెద్దపల్లి ఎంపీ ఓ విచారణ చేపట్టారు. మూడు నెలలు కావస్తున్నా తేల్చని విచారణ.
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం భోజన్నపేట్ గ్రామానికి చెందిన కుడుదుల సాగర్ S/oరాజకొమురయ్య తేదీ 26.7.2021 రోజున మృతి చెందగా, మృతుని పేరుమీద అధికారులు రెండు ప్రాంతాలలో మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన విషయం అగ్నిధార న్యూస్ లో ప్రచురితమైన విషయం విధితమే, ఇట్టి విషయమై 29.9.2021 రోజున పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి కి ఒకే వ్యక్తికి రెండు డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయమై, కుడుదుల సాగర్ భార్య సంబంధికులు ఫిర్యాదు చేశారు. భోజన పేట పంచాయతీ కార్యదర్శి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం వల్ల కుడుదుల సాగర్ భార్యకి తీవ్రస్థాయిలో ఆర్థిక నష్టం ఏర్పడింది. సమస్య తక్షణ పరిష్కారం కొరకు జిల్లా పంచాయతీ అధికారికి, ఫిర్యాదు చేసినప్పటికీ, ఫిర్యాదు చేసిన 48 రోజుల తర్వాత విచారణ అధికారిగా పెద్దపల్లి ఎం పి ఓ సుదర్శన్ తేదీ15.11.2021 రోజున భోజన్నపేట్, గ్రామ పంచాయితీలో గ్రామ సర్పంచ్ మేకల మల్లేశం సమక్షంలో విచారణ చేపట్టారు .విచారణ చేపట్టి నెల రోజులు గడుస్తున్నా మరణ ధ్రువీకరణ పత్రం జారీ విషయమై ఇప్పటికీ ఎటూ తేలక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది పరిస్థితి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఫిర్యాదుదారు కోరుతున్నారు.
పెద్దపల్లి ఎంపీఓ విచారణచేపట్టినదృశ్యం( ఫైల్ ఫోటో )
