లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ వారిచే ఐ విజన్ సెంటర్ ప్రారంభం
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో స్థానిక సవేర ఆప్టికల్స్ ఆవరణలో ఐ విజన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ లయన్ డా.రేకులపల్లి విజయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కంటి ఆవశ్యకతను గుర్తించాలని అన్నారు. మారిన జీవన విధానం,ప్రస్తుత ఆహార నియమాలు వలన చిన్న వయసు నుండి కంటి జబ్బులు మొదలవడం దురదృష్టకరమన్నారు. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు, దృష్టిలో పరీక్షలు చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్ మాట్లాడుతూ..ఈ విజన్ సెంటర్లో ప్రతి గురువారం కంటి పరీక్షలు సీనియర్ ఆప్టోమెట్రిస్ట్ లయన్ అబ్దుల్ వాసే ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తామని,కంటిలో శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు,ఉచిత రవాణా,భోజన వసతులు కల్పిస్తామన్నారు.పెద్దపల్లి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ ఆయాజ్,శ్రీశక్తి అధ్యక్షురాలు విజయగిరి సుధా, సిద్దార్థ పారా మెడికల్ కళశాల డైరెక్టర్ వంగల రవీందర్,నేత్రవైద్య సహాయకులు లయన్ భూతగడ్డ చందు పాల్గొన్నారు.
