న్యూ ఇయర్ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలి. 31రాత్రి విస్తృతంగా తనిఖీలు…నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు.
పెద్దపల్లి జిల్లా అగ్నిధారన్యూస్. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి రెండవ తేదీ వరకు ఆంక్షలు విధించిందన్నారు. ఈనెల 31న రాత్రి పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగాతనిఖీలునిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. బ్రీత్ అనలైజర్ లతో తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని, వీధుల్లోకి వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమలు చేపడితే చర్యలు తప్పవన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ర్యాలీ లను ప్రభుత్వం నిషేధించిందన్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించిన ఉపేక్షించేది లేదన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేష్, రాజ వర్ధన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
