మెదక్ జిల్లా అగ్ని ధార న్యూస్:
రైతుల ఆత్మ బంధువు సీఎం కెసిఆర్..మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహత్తర కార్యక్రమం నేడు రైతులందరికీ రైతు బంధు ఇచ్చిన సందర్భంగా ముఖ్య మంత్రి కెసిఆర్ చిత్ర పటానికి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తొప్రన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ రైతుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమ మే లక్ష్యం గా పని చేస్తున్నారు అన్నారు.రైతుల ఆత్మ బంధువు సీఎం ఐ రైతు బంధువు పథకం ద్వారా ప్రతి రైతు గుండెల్లో నిలిచిపోయారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ,కౌన్సిలర్లు మామిడి వెంకటేష్,శ్రీశైలం గౌడ్,కోడిపాక నారాయణ గుప్త,బొంది అరుణ వెంకట్ గౌడ్, బాణపురం రాజు, మరియు టి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సతీష్ చారి,సెక్రెటరీ ఏర్పుల లక్ష్మణ్,మన్నే శ్రీనివాస్,గుర్రం ఆంజనేయులు, బురాన్,హైమద్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
