త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి                                    పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: గురువారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించి జరుగుతున్న ఆధునీకరణ పనులను  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  పోలీస్ స్టేషన్ కు తమ అవసరాల రీత్యా వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని ప్రజల చేత మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి సారంగపాణి, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ లు లక్ష్మణ్, ఉపేందర్, వెంకటేష్,రాజవర్ధన్, సునీత లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.