కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగాపెద్దపల్లిఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొనిమాట్లాడారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు రాష్ట్ర అన్నదాతలకు వరం అన్నారు . ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.రైతులు ఆర్థికాభివృద్ధి పొందినప్పుడే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగుంటాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి, ప్రభుత్వం అమలు చేస్తుందనారు.రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. రైతును రాజులను చేయడం కోసం కెసిఆర్ తపిస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు పేరిట రైతుల ఖాతాల్లో 55 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కె,దక్కుతుందన్నారు. కునారం గ్రామంలో ఇప్పటివరకు లక్షలాది రూపాయలను రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవనీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల కోసం అహర్నిశలు పనిచేస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా, రైతుబంధు, 24 గంటల విద్యుత్,రైతువేదికల నిర్మాణం,సబ్సిడీ ఎరువులు, పనిముట్లు,విత్తనాలు, అదేవిధంగా ఆసరా పింఛన్, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి తదితర అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కుతుందన్నారు. అనంతరం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ లు చదువు రాంచంద్రారెడ్డి, ,రైతుబంధు మండల కో ఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, మార్కెట్ చైర్మన్ కొట్టే సుజాత రవి, మార్కెట్ వైస్ చైర్మన్ బూసి సదాశివ రెడ్డి, స్థానిక సర్పంచు డొంకేన విజయ మొగిలి, ఎంపీటీసీ కొల్లూరి రమా దేవి, రాజమల్లు, నాయకులు బుర్ర సదానందం, దొమ్మటీ శ్రీనివాస్,కొట్టే సమ్మయ్య, కారుకూరి సత్యనారాయణ, సిరిపురపు శ్రీనివాస్, కూకట్ల నవీన్, రావికంటి వేణు, రాజు,చంద్రయ్య, శ్రీనివాస్ మొండయ్య, రాజయ్య, శ్యామ్, రాజేందర్, నరసయ్య, రవి, కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు. ఎంపీటీసీలు. కార్యకర్తలు. పాల్గొన్నారు.
