ప్రవర్తన మారకపోతే పిడి యాక్ట్ నమోదు చేస్తాం…: జైపూర్ ఏసీపీ నరేందర్.
అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):నేర చరిత్ర గలవారు సత్ప్రవర్తనతో వుండాలని, లేకపోతే పిడియాక్ట్ పెడతామని జైపూర్ ఎసిపి నరేందర్ హెచ్చరించారు. సోమవారం జైపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవుత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. సత్ప్రవర్తనతో జీవిస్తే భవిష్యత్తులో షీట్లు తొలగిస్తామని, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.గత కొంతకాలంగా ఏలాంటి నేరప్రవృత్తి కలిగి లేకుండా సత్ప్రవర్తనతో ఉన్నటువంటి 36 మందిపై షీట్స్ ను తొలగించడం జరిగింది అన్నారు.అదేవిదంగా గత కొంత కాలంగా చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడుతూ పలు నేరాల్లో పాలుపంచుకున్న. 24.మంది వ్యక్తుల పై రౌడీషీటర్లు సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందన్నారు  .ఈ సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు,జైపూర్ ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.