అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): బుధవారం రోజు 73 వ గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు పలు వార్డులలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం స్ఫూర్తి మానసిక వికలాంగులకు బట్టల పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుట్టినందుకు ప్రతి వ్యక్తి గర్వపడాలి అన్నారు భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రజలందరూ కలిసి మెలిసి జీవించే విధానం భారతదేశంలో తప్ప మరే దేశంలో లేదన్నారు. భారతదేశ స్వాతంత్ర అనంతరం ప్రపంచ దేశాల రాజ్యాంగాల పరిశీలన పరిశీలన తరవాత రచించబడిన దృఢ అదృఢ లక్షణాల సమ్మేళనం మన భారత రాజ్యాంగం అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజున ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్,తాడూరి శ్రీమాన్,సయ్యద్ మస్రత్ బొడ్డుపల్లి శ్రీనివాస్,,వీరశం, శ్రావణ్ కర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.
