అగ్నిధార న్యూస్(  గోదావరిఖని ) :  తెలంగాణ కాంటాక్ట్ కార్మిక సంగం ప్రెసిడెట్ మద్దెల శ్రీనివాస్ అధ్యర్యం లో కొత్తగూడెం సింగరేణి హాస్పటల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికుల బారి ధర్నా సింగరేణి వ్యాప్తంగా కదం తొక్కిన స్టాఫ్ నర్స్ వార్డు బాయ్స్ ఆయాలు   కొత్తగూడెంలో లోని సింగరేణి భవన్ ముట్టడించి పెద్ద ఎత్తున భారీ ధర్నా చేశారు.  కోవిడ్ సమయంలో అధిక పని భారంతో ప్రాణాలకు తెగిచి పని చేశారన్నారు. కుటుంబాలకు దూరమై అతి తక్కువ వేతనాలతో పని చేస్తే మా కార్మికులను విధుల నుంచి తొలగించడం  బాధాకరం, ఎన్నోమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన సరైన సమాధానం రాలేదు అన్నారు. అందుకే కార్మికులంతా ఒకటై ఉద్యమిచ్చారని తెలిపారు. మా కార్మికులను 2రోజుల్లో విధులకు తీసుకోవాలని లేని యెడల భారీఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గోదావరిఖని భూపాలపల్లి రామకృష్టపూర్ కొత్తగూడెం నుండి కార్మికులు వందలాది మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో సంగం కార్యదర్శి ఎరుకాల నాగరాజు హాస్పటల్ సిబ్బది కనుకరాజు దుర్గాప్రసాద్ రాకేష్ సాయి విజయ్ సూర్యనారాయణ సంపత్ అరుణ శారదా మినా సృజన సింధు ప్రయా సామల కిరణ్ జోతి సంధ్య గంగ భవాని తదితరులు పాల్గొన్నారు.