అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):మంచిర్యాల ఆర్టిసి డిపో ద్వారా భక్తుల సౌకర్యార్థం ఈనెల 30 నుండి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు బస్సులు  నడపనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. మంచిర్యాల నుండి ఉదయం 8 గంటలకు చెన్నూర్ నుండి ఉదయం 8 గంటల 30నిమిషాలకు బస్సులు,బయలుదేరుతాయని డిపో మేనేజర్ పేర్కొన్నారు .ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.