అగ్ని ద్వారాన్యూస్( కరీంనగర్ ): కరీంనగర్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.కారు బీభత్సంతో ఒకరు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిపై ఉన్న కార్ రిజిస్ట్రేషన్9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు తెలుస్తుంది
కారును వదిలేసి నలుగురు యువకులు పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
