మంథనిలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు.
అగ్నిధారన్యూస్( మంథని ):అహింసకు మించిన ఆయుధం లేదని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు గొటికారి కిషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సత్యం అహింసలనే ఆయుధాలుగా మలుచుకొని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహానీయుడని కొనియాడారు..అనంతరం మంథని గాంధీ చౌక్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ కార్యక్రమంలో నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశి భూషణ్ కాచే, ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి పెరవేణి లింగయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, మంథని మున్సిపల్ కౌన్సిలర్లు పెండ్రు రమ సురేష్ రెడ్డి, చొప్పకట్ల హనుమంతు, మాజీ జెడ్పీటీసీ మూల సరోజన, సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, మాజీ సర్పంచులు, రాం రాజశేఖర్, దొనగొర్ల శ్రీనివాస్ యాదవ్, మంథని మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మంథని రాకేష్, మంథని మున్సిపల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు నజీర్, ఉపాధ్యక్షుడు ఎజాజ్, మంథని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు, ఎరుకల రమేష్ బాబు, పెరుగు తేజ, ఇందారపు అనిల్, తదితరులు పాల్గొన్నారు.
