అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ): శనివారం రోజు వసంత పంచమిని,సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్యులు నగూరి లక్ష్మయ్య తెలిపారు. కరోన ప్రబలుతున్న దృశ్య బాసరకు వెళ్లలేని పిల్లల తల్లిదండ్రుల సౌకర్యార్థం ఉదయం 8:48 నిమిషాలకు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సంకల్పం, అగ్ని ,ప్రతిష్ట ,సరస్వతి మంత్ర, ప్రయుక్త ,ఏకాదశ గాయత్రీ ,యజ్ఞం, పూర్ణాహుతి, సరస్వతి అష్టోత్తరం, అక్షరాభ్యాసం ప్రవచనo,శాస్త్రి మంత్రం ,ప్రసాద వితరణ ఉంటుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు సకాలంలో వచ్చి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సూచించారు వచ్చినప్పుడు వెంట తెచ్చుకోవలసిన పావు కేజీ బియ్యం, రెండు పలకలు, రెండు బలపాలు, మంగళ హారతి ,తమలపాకులు, పసుపు, కుంకుమ, అగరవత్తులు కొబ్బరికాయ అరటిపండ్లు చక్కెర అక్షింతలు, వెంట తెచ్చుకో గలరని తెలిపారు.
మరిన్ని వివరాలకి సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు సెల్ ఫోన్ నెంబర్,9963991191
