అగ్ని ధార న్యూస్ (జగిత్యాల) : పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్ములనపై మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాలేజి లెక్చరర్లతో నిర్వహించిన అవగాహన సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారు మాట్లాడుతూ కాలేజ్ విద్యార్థులకు యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను అవగాహన కల్పించాలి అదే విధముగా మాదకద్రవ్యాల సరఫరా చేసే వారిపై నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.మాదకద్రవ్యాల నిర్ములనపై అందరం కలిసి పోరాడుదాం ముందు తరాలకి మంచి భవష్యత్తు ఇవ్వాలని వారు కొరినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్, వై స్ చైర్మన్ గోలి శ్రీనివాస్,  కౌన్సిలర్లు, కో.అప్షన్ మెంబర్లు, డిఎస్పీ ప్రకాష్, ఎక్సైజ్ సుపురిండెంట్ శ్రీదర్,, సిఐ కిశోర్,ఎక్సైజ్ సిఐ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.