బీమారం తహశీల్దార్ కి  వీఆర్ఏ లు వినతి పత్రం ఇస్తున్న దృశ్యం

అగ్నిధారన్యూస్(  మంచిర్యాల ):తెలంగాణ వీఆర్ఏ ల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు, వీఆర్ఏ ల పే స్కేలు అమలు గురించి,ఈనెల  22 వ తేదీన జరిగే ఛలో హైదరాబాద్ మహాధర్నాకు మంచిర్యాల జిల్లా, భీమారం మండల వీఆర్ఏ లు వెళ్ళడానికి  బీమారం తహశీల్దార్ కి ,ఒక రోజు సామూహిక సెలవు మంజూరు, గురించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లో గల వీఆర్ఏ ల హక్కుల సాధన కోసం ఒకరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వి ఆర్ ఏ లు  అందరూ పాల్గొని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రాజశేఖర్.యాదగిరి, పరమేశ్వరి,క్రాంతి, . రామ్ చందర్.రమేష్,నారాయణ,చంద్రయ్య,లచ్చయ్య, .బానేష్ ,.కిష్టు,లక్ష్మీ ,.దుర్గయ్య,.చంద్రయ్య,శంకర్,. వెంకటి, .రాములు. తదితరులు పాల్గొన్నారు.