కాంగ్రెస్ నాయకుల చర్యను ఖండిస్తున్నా టిఆర్ఎస్ నాయకులు.
అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల ):ఈనెల మూడో తారీకు రోజున కాంగ్రెస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో, జరిగిన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటి ముట్టడిని ఖండిస్తూ, శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ పార్క్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మునిసిపల్ చైర్మన్ పెంట రాజయ్య తెరాస మహిళా సంఘం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
