అగ్నిధార న్యూస్ ( నస్పూర్ )శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జిఎం కార్యాలయం వద్ద గల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు,ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
