■ సమస్యలతో కూడిన వినతి పత్రం అందించిన యాదవ సంఘం నాయకులు. 

■ గొర్రెల పంపిణీని పథకం  డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలి.

■ నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ ని ఏర్పాటు చేయాలి.

■ సానుకూలంగా స్పందించిన మంత్రి  తలసాని.

అగ్నిధారన్యూస్(  హైదరాబాద్ )ఆదివారం రోజు సికింద్రాబాదులోని తెలంగాణ రాష్ట్ర పశువర్ధక శాఖ  తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు.   మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను   వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక గొర్రెల మేకల మార్కెట్ యార్డ్ ని నిర్మించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో పశువుల  రోగ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,  గొర్రెలకు మేకలకు సకాలంలో వాక్సినేషన్ అందించాలని, గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, సేవ మరియు చేతివృత్తుల వారికి  ఇస్తున్న విధంగా  50 సంవత్సరాలు దాటిన యాదవ సోదరులకి పెన్షన్ ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొఱ్ఱెలపంపిణీ పథకంలో లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా డబ్బులు వేయాలని  వినతి  పత్రం అందించారు… ఈ కార్యక్రమంలో  కమాన్ పూర్ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్,  మేకల నర్సయ్య యాదవ్. తదితరులు పాల్గొన్నారు.