అగ్నిధారన్యూస్ ( నస్పూర్ )ఆదివారం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ,జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన పోక్సో కోర్టులో కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. మంచిర్యాల పేరులో ఉన్న మంచిని పెంపొందించాలని, కోరారు. ఈ కార్యక్రమంలో, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పాల్గొన్నారు.