అగ్నిధార న్యూస్(  వరంగల్  ):  వరంగల్ పట్టణంలో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో , లూయిస్ అంధుల పాఠశాల నందు హోలీ సందర్బంగా వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ….గుడ్లు ను వాడుకునే విధానం గురించి తెలియజేసారు….

పౌష్టికాహర లేక భాధ పడుతుంటే మనంహోలీ పండగకి   గుడ్లు వృధా చెయ్యొద్దు అనే సందేశంతో అందుల పాఠశాలలో గుడ్లు పండ్లు వారికి అవసరం వున్నా ట్యూబ్ లైట్స్(మందులు) పంపిణీ చేశారు. అలాగే వారితో హోలీ వేడుకలు జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ రాజ్యలక్ష్మి మేనేజంగ్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతరం అంద విద్యార్థుల తో కలిసి ఒకరినొకరు రంగుల తో హొలీ వేడుక జరుపుకొన్నారు,అంద విద్యార్థులు చీకటి లో రంగుల ప్రపంచం చూసామంటూ అనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంస్కృతి ఫౌండేషన్ ఆ సంస్థ చైర్మన్ మాట్లాడుతు మున్ముందు కూడా ఈ పాఠశాల అందవిద్యార్థులు కు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కిరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.