■  రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలలో పని చేసేవారికి కనీస సౌకర్యాలు కల్పించాలి.

■ చనిపోయిన కుటుంబానికి ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత కల్పించాలి.

■ లక్ష్మణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

■ పెద్దపల్లి జిల్లా ఆపరేటర్ల సంఘం డిమాండ్.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )ఆదివారం రోజున, జనగామ మండలము మరియు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము నందు కంప్యూటర్ ఆపరేటర్ , ఎకౌంట్స్ అసిస్టెంట్ గా గత 16 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న బానోతు లక్ష్మణ్ 38 సం.రాలు. గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. దీనికి ప్రధాన కారణం పథకానికి సంబంధించిన ఈఆర్థిక సంవత్సరపు మెటీరియల్ కాంపౌండ్ యొక్క కోట్ల రూపాయల లక్ష్యాలను సాధించుటకు తనపై ఒత్తిడి వలనే అర్ధాంతరంగా తను తనువు చాలించాడని ఆ పథక రాష్ట్ర, జిల్లా సంఘం పేర్కొన్నది. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఇదే తరహా ఒత్తిడిని కలుగజేసి ఈ ఆర్థిక మాసపు మెటీరియల్ కాంపౌండ్ కు సంబంధించిన వందల కోట్లా రూపాయల పనులకు సంబంధించిన కార్యాలయ కార్యక్రమాలను పనివేళలతో సంబంధం లేకుండా కనీస సిబ్బందిని, మౌలిక సదుపాయాలను కల్పించకుండా ఈ రకమైనటువంటి ఒత్తిడిని పెడుతున్నారని తద్వారా రాష్ట్రంలో ఇంకా ఎందరో బలి కావలసినటువంటి పరిస్థితులను కల్పిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. గతంలో కూడా ఈ రకమైనటువంటి ఒత్తిడి కారణంగా అనేకమంది కంప్యూటర్ ఆపరేటర్ , అకౌంట్స్ అసిస్టెంట్లు మానసిక శారీరక సమస్యలకు గురయ్యారని మరెందరో గుండెపోటుతో చనిపోయారని అన్నారు ….సోమవారం రోజు పెద్దపల్లి డిఆర్డిఎ కార్యాలయం ఆవరణలో పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వి శ్రీధర్ , గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది , నిర్వహించిన సంతాప కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో. పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు, కంప్యూటర్ ఆపరేటర్ సుజాత, TA లు వెంకటేష్, హాసన్, JE రాజయ్య   డి ఆర్ డి ఓ కార్యాలయం సిబ్బంది మధునమ్మ, తదితరులు పాల్గొన్నారు