■   పెద్దపల్లిలో పోస్టల్  డిపార్ట్ మెంట్ సమ్మె కు  మద్దతు తెలుపుతున్న దాసరి ఉషా.

■  కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రెండు రోజులు విధులు బహిష్కరించిన పోస్టల్ ఉద్యోగస్తులు.

■  కేంద్ర ప్రభుత్వం దిగి రానట్లయితే దేశవ్యాప్తంగా మరో సమ్మె తప్పదు.

■  NFPE డివిజన్ అధ్యక్షులు నాoసాని కొమురయ్య యాదవ్.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  పెద్దపల్లి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తలపెట్టిన రెండు రోజుల సమ్మె మంగళవారం కొనసాగుతుంది.  పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సమ్మెలో  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాల కు దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది ఈ సందర్భంగా    NFPE డివిజన్ అధ్యక్షులు నాoసాని కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ…..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న  ఉద్యోగ ,  ,కార్మిక, కర్షక  విధానాలకు వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడలకు నిరసనగా దేశవ్యాప్తంగా రెండు రోజుల సార్వత్రిక సమ్మె లో భాగంగా పెద్దపల్లిలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం చెప్పడం జరిగిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మిక ఉద్యోగ సంఘాల డిమాండ్లు  నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల మరోమారు దేశవ్యాప్త పోస్టల్ ఉద్యోగుల నిరసన సెగలు కేంద్రానికి తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ,దాసరి ఉష   AIGDSU శంకరయ్య, రత్నం ,  సదానంద కోటి చిరంజీవి ,రాజు ,వేణు, వికాస్ ,, రమేష్, ఖయ్యుం ,తిరుపతి ,సమ్మయ్య ,అంకుష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.