2. దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ .
రణంలో కీర్తిపతాక ఉబలాటం, బుజబలానికి భజకీర్తుల కోలాటం,
బుద్ది బలంలో బేలచూపులు.
స్థిమిత పడని అస్తిమితం.
లేని దానికై అర్రులు
ఆశనిపాతమై పోతున్న అవివేకం..
ఆగ్రహావేశాలఈర్ష్యాద్వేష అహంకార
కుటిలకుతంత్రకుయుక్తుల వలలో చిక్కి
చివరకంటా కంటగింపు కాక,
రణరంగంలో రథమును
గురువర్యుల వైపు నడుపుతున్నప్పుడు
రారాజై సర్వోన్నతాధికారియై
కనుసైగలతో మంది మార్భలాన్ని
నడిపించే అధికారముండి,
ఎదురు నిలిచియున్న పాండవ
సైన్యాధ్యక్షుడి వజ్రవ్యూహానికి జడిసి
కౌరవ సైన్యాధ్యక్షుడు
భీష్మ పితామహుడుచెంతకు కాక
దుర్యోధనుడు,
ద్రోణాచార్యుడు వద్దకు వెళ్లడం
కుంచితత్వమా? లేక
గురుభక్తా? లేక భితి సూచకమా??
గాయకవాడ ప్రసాద్
