■  పుణ్యస్థలాల సందర్శన భాగ్యం అందరికి కల్పిస్తాం….
■ దేశ రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిని తీసుకెళ్తం
■  మావో పుణ్యస్థల సందర్శనతో జన్మ దన్యమైంది
■  మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )   సోమవారం మహనీయుల జన్మస్థలాల సందర్శనలో బాగంగా మద్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లాలోని మావో పుణ్యస్థలమైన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మస్థలాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మావోలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన బుద్ద విగ్రహం వద్ద కాసేపు ధ్యానం చేశారు.

ఈ సందర్బంగా   జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ…………మావో పుణ్య స్థలాన్ని సందర్శించి అక్కడ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం జరిగిందని, ఈ ధ్యానం చేసిన సమయంలో ఒక ఆలోచన చేసినట్లు చెప్పారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక ఎన్రోల్మెంట్ పెట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతీబావు పూలే లాంటి మహనీయుల జన్మస్థలాలను దర్శించుకోవాలనుకునే వారికి ఈ అవకాశం కల్పించాలని ఆలోచన వచ్చిందని చెప్పారు. మహనీయుల పుణ్యస్థలాలను దర్శించుకోవాలనుకునే ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన ప్రతి ఒక్కరిని సందర్శించుకునే బాగ్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

మహనీయుల జన్మస్థలాలు, పుణ్యస్తలాలను సందర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా బావిస్తున్నట్లు తెలిపారు. ఆ బాగ్యం మంథని నియోజకవర్గానికి చెందిన వారికి కల్పించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత సందర్శనలో మళ్లీ పూణే ఇండోర్ మావో ప్రాంతాలే ఉంటాయని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిని మహనీయుల పుణ్యస్థలాల సందర్శనకు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట యువ నాయకులు జక్కు రాకేష్, తగరం శంకర్ లాల్, ఎస్ కే యాకూబ్, అజ్మీరా పూల్ సింగ్ ఉన్నారు.