4. అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥.
5. ధృష్టకేతు శ్వేకితాన : కాశిరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ : |
6. యుధామన్యుశ్చ వికాస్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా ॥
10 వేలమంది యోధులతో
ఏక కాలంలో యుద్ధం చెయ్యగల
మహరధి,
స్వయానా శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకి,
అఖండ ప్రచండుడు శిశుపాలుని పుత్రుడు
ధృష్టకేతు …
కూకటివెళ్ళతో సహా మహావృక్షాలు
సైతం కూల్చగల కుంతీతమ్ములు
పురజిత్, కుంతిభోజుడు.
శత్రుసైన్యాన్ని నిశ్చేష్టులుగా
నిలువరించ గలిగిన చేకితానుడు..
అరవీర పరాక్రశాలి కాశీరాజు,
సర్వోత్తమ శైభ్యుడు,
శౌర్య పరాక్రమశాలి యుధామన్యుడు,
పద్మవ్యూహనికి ముచ్చెమటలు
పట్టించగలిగిన అభిమన్యుడు,
ఉపపాండవులు..
వీరందరూ కలిసి ఒక్క భీమార్జునులకు
సమానులని గురువుగారికి చెప్పడంలో
దుర్యోధనునికి భయం పుట్టేనా?
లేక..
ఆచార్యుడికీ శత్రుసైన్యంపై రోషం పోసేనా?
లేక..
స్వపక్ష దైర్యం సన్నగిల్లి
విపక్ష సైన్యం చూసి తత్తర పడేనా?
